పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణం కొవ్వూరుగూడెంలో రిటైర్డ్ టీచర్ కల్వకుర్తి నాగేశ్వరరావు గత ఐదేళ్లుగా జపాను షెపర్డ్‌కు చెందిన ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానిని ముద్దుగా రాయ్ అనే పేరుతో పిలుచుకుంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలోకి ఓ త్రాచుపాము ప్రవేశించింది. దానిని గుర్తించిన శునకం రాయ్ అడ్డుపడి పోరాటం చేసి పామును తీవ్రంగా గాయపరిచింది. ఈ క్రమంలో పాము రాయ్‌ను పలుమార్లు కాటువేయడంతో కొద్ది సేపటికే మృతి చెందింది. దీంతో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకం తమ ప్రాణాలను కాపాడేందుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం రాయ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: