సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంత ఊళ్లో వాలిపోతారు. గోదారోళ్లు అయితే అల్లుళ్లకు చేసే మర్యాదలు చెప్పనవసరం లేదు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణానికి చెందిన మానే నాగేశ్వరరావు, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె యశోద సాయి. ఆ అమ్మాయికి ఇటీవల కృష్ణాజిల్లా లక్ష్మీ పురానికి చెందిన పులగం త్రిమూర్తులు నాగ కుమారి దంపతుల కుమారుడు వినయ్ కుమార్కు ఇచ్చి వివాహం చేశారు. ఇరువురు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం తర్వాత తొలి సంక్రాంతి కావడంతో అల్లుడు వినయ్ కుమార్, వియ్యపురాలు నాగ కుమారుని సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు.
కనుమ పురస్కరించుకుని అల్లుడికి నాగేశ్వరరావు దంపతులు 365 రకాలు ఆహార పదార్థాలు సమకూర్చి విందు ఇచ్చారు. వీటిలో ప్రధానంగా 40 రకాలు గుమగుమలాడే గరం మసాలా మాంసాహారం కూరలు తయారు చేయడంతో పాటు 140 పిండి వంటలు, పండ్లు, ఐస్ క్రీం, డ్రింక్ లు, వివిధ రకాల స్నాక్స్ తో విందు భోజనం వడ్డించారు. తినలేను బాబోయ్ అనే దాకా వదలమంటే వదలమంటూ కొసరి కొసరి వడ్డించారు. వీరు ఇచ్చిన ఆతిథ్యం వియ్యాలవారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Family Meet: పండగ అంటేనే కొండంత సందడి.. భోజనాలు ఓ మధురానుభూతి