ETV Bharat / state

32 బస్తాల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం - 32 bags of illegal ration rice seized in iragavaram

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కె. ఇల్లిందలపర్రు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

west godavari district
32 బస్తాల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
author img

By

Published : Jul 21, 2020, 9:40 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 32 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తూర్పు విప్పర్రు గ్రామానికి చెందిన మాకినేటి త్రిమూర్తులు, మైలవరపు గోవింద్ గా పోలీసులు గుర్తించారు. వారి వద్దనున్న ఆటోను సీజ్ చేశారు.

ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని ఎవరైనా అక్రమ తరలింపు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నిందితులు ఇద్దరిని రిమాండ్ కు తరలించిన్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.

ఇదీ చదవండి నరసన్నపాలెం వద్ద పట్టుబడిన గంజాయి లారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.