పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బస్సును బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనంలోని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన పర్సా రామకృష్ణ(25), వెలివేల గాంధీ(25), బలిన నరేంద్ర(నాని)(25)గా పోలీసులు గుర్తించారు. వీరు ఏలూరు వైపు నుంచి తమ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యువకులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ దాటి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇంద్ర బస్సును ఢీకొంది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వాహనం నుంచి బయటకు తీశారు. ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత ఇక్కడికి వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి