ETV Bharat / state

నరసాపురంలో ముగిసిన 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు - నరసాపురంలో ముగిసిన 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రుస్తుం బాధ గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి.

25th National Level Kabaddi Competitions Ended
ముగిసిన 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
author img

By

Published : Jan 19, 2020, 10:56 AM IST

ముగిసిన 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

కబడ్డీ పోటీలను చూస్తే ఇంకా సంక్రాంతి వెళ్లనట్లే ఉందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు అన్నారు. నరసాపురంలో రుస్తుం బాధ గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో మహిళా విభాగంలో ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, దిల్లీ జట్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. పురుషుల విభాగం ఆంధ్ర, చిల్లర్స్​ క్లబ్ దిల్లీ, కర్ణాటక, విదర్భ జట్లు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రూ. లక్ష, రూ.75 వేలు,రూ, 50వేలు, రూ. 25 వేలు చొప్పున నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సమానంగానే చూడాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల పిల్లలు ఆటలకు దూరమైపోతున్నారని అన్నారు. మానసిక శారీరక వికాసానికి దోహదపడే క్రీడలను ప్రోత్సహించాలన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీసీబీ ఛైర్మన్ కౌరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అమ్మఒడిలో తప్పుల దిద్దుబాటుకు 21న ఆప్షన్లు

Intro:ap_tpg-31_18_kabaddi_avb_ap10090.

యాంకర్.. నరసాపురంలో ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు.

Body:వాయిస్ ఓవర్... నరసాపురంలో కబడ్డీ పోటీలను చూస్తే ఇంకా సంక్రాంతి వెళ్ళనట్లే ఉందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ పరిధి రుస్తుం బాధ గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి ఈ పోటీలలో మహిళా విభాగంలో ఆంధ్ర, రాజస్థాన్ ,తెలంగాణ ,ఢిల్లీ జట్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి పురుషుల విభాగం ఆంధ్ర ,చిల్లర్స్ క్లబ్ ఢీల్లీ, కర్ణాటక, విదర్భ జట్లు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి నాలుగు స్థానాలు సాధించిన జట్లు రూ. లక్ష ,రూ. 75 వేలు , రూ. 50 వేలు , రూ. 25వేలు చొప్పున నగదు బహుమతులు జ్ఞాపికలు అందజేశారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సమానంగానే చూడాలన్నారు. గతంలో విద్యతో పాటు క్రీడల్లోనూ శిక్షణ ఉండేదన్నారు ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థలు పిల్లలు ఆటల దూరమై పోతున్నరన్నారు. ఈ దృక్పథం నుంచి పిల్లల తల్లిదండ్రులు మార్పు రావాలన్నారు. మానసిక శారీరక వికాసానికి దోహదపడే క్రీడల ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు , మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, dccb చైర్మన్ కౌరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్ ,పురపాలక కమిషనర్ సత్య వేణి, తాసిల్దార్ సిహెచ్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు

Conclusion:బైట్స్...
1. రేవు ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ ,పశ్చిమ గోదావరి జిల్లా .
2.కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ మంత్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.