పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమల్లి సమీపంలోని ఓ తూము చెరువు ప్రాంతంలోని ఓ పొలం వద్ద చేపల వలలో 12 అడుగుల కొండ చిలువ చిక్కుకుంది. వారం రోజులు అలాగే ఉండిపోయింది. దానిని బయటకు తీయడానికి భయపడిన రైతులు... స్నేక్ సేవియర్ సొసైటీ డైరెక్టర్ క్రాంతి చదలవాడకు సమాచారం అందించారు.
అక్కడకు చేరుకున్న క్రాంతి... చేపల వలలో చిక్కుకున్న కొండచిలువను రక్షించి జంగారెడ్డిగూడెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అనంతరం వైద్యం కోసం జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురం వద్ద గల పశువుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శ్రీనివాస్ కొండచిలువకు శస్త్రచికిత్స చేశారు. 10 రోజుల పర్యవేక్షణ అనంతరం కొండచిలువను అడవిలో వదిలేస్తామని వారు తెలిపారు.
ఇదీ చదవండి