కృష్ణా జిల్లాలో...
మైలవరం ఐసీడిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. గర్బిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పధకం వరప్రసాదం లాంటిదని పేర్కొన్నారు. ఇలాంటి పధకాన్ని ఇంత వరకూ ఏ రాష్ట్రం అమలు చేయలేదన్నారు. లబ్ధిదారులకు సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
మాతా శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించిందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మంగళవారం అడ్డతీగలలోని ఐసీడీఎస్ కార్యాలయంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణీలకు, బాలింతలకు పోషకాహార కిట్లు అందజేశారు.
విజయనగరం జిల్లాలో...
సాలూరులో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర ప్రారంభించారు. రాష్ట్రంలోని చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు సంపూర్ణ పోషణ కోసం ప్రభుత్వం రూ. 1,863 కోట్లు కేటాయించిందన్నారు.
ఇదీ చదవండి: