విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా సమన్వయకర్త మజ్జి శ్రీను.. దివంగంత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి లబ్ధిదారునికి అందుతున్నాయా లేదా అని ఈ ప్రచార యాత్రలో ఉంటుంది. ప్రతి గ్రామంలో ఈ పాదయాత్ర జరుగుతుంది. ప్రజల తరఫున వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని.. ప్రతి ఒక్కరికీ భరోసా కలిగించడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.
పార్వతీపురంలో 'ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ... సాగారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాజాభజంత్రీలతో యువత మహిళలు నృత్యాలతో పాత బస్టాండ్ వరకు పాదయాత్ర చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఏడాదిన్నరలోనే ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అన్ని వర్గాల వారి అభ్యున్నతికి పాటు పడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: