ETV Bharat / state

'పాదయాత్రల సమయంలో కరోనా గుర్తు రాలేదా?'

తెలుగుదేశానికి భయపడే.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించటం లేదని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. కరోనా తీవ్రంగా ఉందని చెబుతున్న వైకాపా నేతలు... పాదయాత్రలు ఎలా నిర్వహించారని ప్రశ్నించారు.

vangalapudi anitha
vangalapudi anitha
author img

By

Published : Nov 18, 2020, 9:07 PM IST

ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైకాపా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలో అశోక్ గజపతి రాజు బంగ్లాలోని తెదేపా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉందని సీఎస్ నీలం సాహ్ని చెబుతున్నారని... మరి పాఠశాలలు, సినిమా థియేటర్లకు అనుమతి ఎలా ఇచ్చారని అనిత ప్రశ్నించారు.

వైకాపా నేతల పాదయాత్రల్లో పెద్దఎత్తున ప్రజలు మాస్కులు, సామాజిక దూరం పాటించకుండానే పాల్గొంటున్నారని చెప్పారు. దీనివల్ల ప్రజలకు, నాయకులకు భద్రతనిస్తున్న పోలీసులకు కరోనా సోకదా అని నిలదీశారు. కేవలం తెదేపాకు భయపడే వైకాపా నేతలు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారని అనిత విమర్శించారు.

ఇదీ చదవండి:

ప్రజలకు గోరంత ఇస్తూ కొండంత దోపిడీ : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.