వేతన బకాయిలు చెల్లించాలంటూ బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు.. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం శ్రీరాంపురంలో ఆందోళనకు దిగారు. గ్రామంలోని స్టీల్ ఎక్సైజ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో ఎస్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేశారు. లాక్ డౌన్ తర్వాత వేతనాలు చెల్లించి స్వస్థలాలకు పంపుతామని కర్మాగారం యాజమాన్యం స్పష్టం చేసింది.
అయితే వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా.. కార్మికులు వారిపై రాళ్లు రువ్వారు. ఈ కారణంగా... పోలీసు వాహనాల అద్దాలు పగిలగా.. కేసు నమోదైంది. చివరికి.. యాజమాన్యం వారికి బకాయిలు చెల్లించింది.
ఇవీ చదవండి: