ETV Bharat / state

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన

తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టిన ఘటన విజయనగరం జిల్లా సీసాడ వలసలో జరిగింది. దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని.. అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేయాలని కోరారు.

women protest for drinking water in sisadavalasa in vizianagaram district
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన
author img

By

Published : Aug 17, 2020, 3:18 PM IST

విజయనగరం జిల్లా కొమరాడ మండలం సీసాడ వలస గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ గిరిజనులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి వారికి మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నీటి ట్యాంకు ఉన్నా తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. 4 నెలలనుంచి అధికారులకు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. దూరప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

ఇవీ చదవండి..

విభజన గాయాలను సీఎం జగన్ మళ్లీ రేపారు: అమరావతి రైతులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.