ETV Bharat / state

శంబర గ్రామంలో ఎంపీడీవోను అడ్డుకున్న మహిళలు

విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో ప్రభుత్వం అందించిన చేయూత పథకానికి వాళ్ళందరూ అర్హులే.... గత ఏడాది అర్హత లేదని నిరాశ చెందినా... ఈ ఏడాది వస్తుందనే ఆశ పడ్డారు. ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ చేయడం, కుల ధ్రువీకరణ పత్రాలకు నానా తంటాలు పడుతూ అన్ని పత్రాలను సిద్ధం చేశారు. తీరా దరఖాస్తు చేద్దామంటే వాలంటీర్ లాగిన్ లేదని అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో చేసేది లేక మహిళలు... ఎంపీడీవోను అడ్డుకున్నారు.

శంబర గ్రామంలో ఎంపీడీవోను అడ్డుకున్న మహిళలు
శంబర గ్రామంలో ఎంపీడీవోను అడ్డుకున్న మహిళలు
author img

By

Published : Jun 17, 2021, 10:37 PM IST

శంబర గ్రామంలో ఎంపీడీవోను అడ్డుకున్న మహిళలు

విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలోని 160 మంది మహిళలు చేయూత పథకానికి అర్హులై ఉన్నారు. వీరందరూ దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయానికి గత కొంతకాలంగా తిరుగుతున్నారు. అయితే వాలంటీర్ లాగీన్ లేదని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. సమస్య పెద్దది కావడంతో గురువారం సచివాలయానికి చేరుకున్న ఎంపీడీవో సి. హెచ్ సూర్యనారాయణ...అక్కడి మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారు మరింత ఆగ్రహానికి గురై.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంపీడీవోను చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజేష్ అక్కడకు చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్య ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లామని, వారి ఆదేశాల మేరకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీడీవో, ఎస్సై వారికి చెప్పారు.

సమస్య ఇదే...

శంబర గ్రామంలో సుమారు ఐదు వేలకు పైగా జనాభా ఉంటారు. 30 మంది ఉన్న బీరమాసిలో చేర్చి షెడ్యూల్డ్ గ్రామంగా మార్చారు. అప్పటి నుంచి పంచాయతీ పరిషత్ ఎన్నికలతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా ఎస్టీ రిజర్వేషన్ ప్రకారమే వస్తున్నాయి. రెండేళ్ల కిందట వాలంటీర్ నోటిఫికేషన్ విషయంలో 35 మందిని నియమించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే అందులో లో బీసీలకు కేటాయించడంతో కొంతమంది కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు వాలంటీరు నోటిఫికేషన్ నిలుపుదల చేయాలని జీవో రావడంతో అప్పటి నుంచి శంబరకు వాలంటీర్లు లేరు. పింఛన్లు, ఇతర పథకాలు పంపిణీ చేయడానికి పరిసర ప్రాంత వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వస్తున్నారు.

ఇదీ చదవండి:

Cji NV Ramana: రేపు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.