విజయనగరం జిల్లా కొమరాడ మండలం సోమినాయుడువలస సమీపంలోని పొలాల్లో ఓ ఈతచెట్టు విరగ్గాసింది. చెట్టుకు ఆకులున్నా.. ఒక్క మట్ట కూడా లేదు. దూరం నుంచి చూస్తే కాయలే పచ్చగా ఆకుల్లా కనిపిస్తున్నాయి. చెట్టంతా ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు ఉండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పార్వతీపురం ఐటీడీఏ పీహెచ్‌వో మణిభూషణ్ దృష్టికి తీసుకెళ్లగా ఈ మట్టలు తొలగించడం వల్ల గెలల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: ప్రజలకు పెట్రో మంట.. సర్కారుకు కాసుల పంట