సాయం చేయమంటూ వచ్చే బాధితులపై వైకాపా నేతల ప్రోద్బలంతో వాలంటీర్ల దాడులు ఆగడం లేదు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో ఇరు కుటుంబాల్లో జరిగిన భూతగాదాలో... గ్రామ వాలంటీర్ జోక్యంతో గొడవ మరింత పెరిగింది. స్థానిక వైకాపా నేతల ప్రోద్బలంతో మహంతి అన్నపూర్ణ అనే మహిళపై వాలంటీర్ కిలారి సంతోషి, ఆమె భర్త ప్రసాద్ దాడికి పాల్పడ్డారు. సంతోషి బాధితురాలి కంట్లో కారం చల్లగా... మహిళ అని కూడా చూడకుండా ప్రసాద్ విచక్షణారహితంగా దాడి చేసి రోడ్డుపైకి లాక్కొచ్చాడు.
గాయాలపాలైన బాధిత మహిళను కుటుంబసభ్యులు విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందకపోవడంతో... తగాదా వెనుక వైకాపా నేతల జోక్యం ఉందంటూ స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి:
కాంగ్రెస్ ర్యాలీ భగ్నం.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అరెస్ట్