ETV Bharat / state

Vizianagaram Weight Lifters: ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే.. అయినా భళా అనిపిస్తున్న వెయిట్ లిఫ్టర్స్ - kondavelagada weightlifters

Vizianagaram Weightlifters: కొండవెలగాడ అంటే ఠక్కున గుర్తొచ్చేది వెయిట్ లిఫ్టింగ్. ఇక్కడి వారంతా చిన్నపటి నుంచే బరువులెత్తుతూ ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతున్నారు. వల్లూరు శ్రీనివాసరావు, మత్స్య సంతోషి ఇక్కడి వారే. ప్రస్తుతం శనపతి పల్లవి, బెల్లాన హారిక, వల్లూరు అజయ్ బాబు, చుక్కా శ్రీలక్ష్మీ వారి బాటలో నడుస్తూ విజయనగరం జిల్లా పేరుని దేశస్థాయికి తీసుకెళ్తున్నారు. వీరితో పాటు.. అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన చంద్రంపేట నివాసి శనపతి గురునాయుడు సైతం కొండవెలగాడలోనే సాధన చేసి సత్తా చాటుతున్నాడు. వీరంతా ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగిన కామన్ వెల్త్ ఛాంపియన్​షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మెరిశారు. ఏషియన్ గేమ్స్ లోనూ పతకాలు భళా అనిపించారు. ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ప్రస్తుతం సాధన చేస్తున్నారు.

Vizianagaram Weightlifters
Vizianagaram Weightlifters
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 8:41 AM IST

Vizianagaram Weightlifters: ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా.. భళా అనిపిస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టర్స్

Vizianagaram Weight Lifters: బరువులెత్తే వీరులున్న ఊరు.. విజయనగరం జిల్లాలో కొండవెలగాడ. అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ఇక్కడ నుంచి మెరిశారు. సులువుగా బరువులెత్తుతూ జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకొస్తున్నారు. క్రీడా కోటాలో ఉద్యోగాలు తెచ్చుకుని ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగారు. వీరి బాటలో నడిచేందుకు గురునాయుడు, పల్లవి, హారిక ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు తగ్గ సాధన చేస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ఇటీవల జరిగిన ఏషియన్ యూత్ ఛాంపియన్​షిప్, కామన్ వెల్త్ ఛాంపియన్​షిప్ వంటి అంతర్జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన వెయిట్ లిఫ్టర్​ శనపతి గురునాయుడు ప్రతిభతో గ్రామం పేరు అంతర్జాతీయంగా సువర్ణాక్షరాలతో లిఖితమైంది. చంద్రంపేటకు చెందిన 18 ఏళ్ల గురునాయుడు మెక్సికో దేశం లియోనాలో జరిగిన ఐడబ్ల్యూఎఫ్(యూత్ వరల్డ్ ఛాంపియన్​షిప్​) పోటీలలో సత్తా చాటాడు. 55 కిలోల బాలుర విభాగంలో పాల్గొన్ని స్నాచ్ 104 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ 126 కిలోలు.. మొత్తం 230 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని సాధించాడు. స్నాచ్ లో వెండి పతకం.. క్లీన్ అండ్ జెర్క్ లో బంగారు పతకం.. ఛాంపియన్​షిప్​లో ప్రథమ స్థానంలో నిలవటంతో మరో బంగారు పతకాన్ని సాధించి.. అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేశాడు.

Youngman talent in Weight Lifting: ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యం.. పవర్​ లిఫ్టింగ్​లో యువకుడి సత్తా

ఐడబ్ల్యూఎఫ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన భారతీయ తొలి వెయిట్ లిఫ్టర్ గా రికార్డు సాధించాడు. ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే కోచ్ చల్లా రాము వద్ద శిక్షణ పొందుతూ వెయిట్ లిఫ్టింగ్​లో గురు నాయుడు ఆరి తేరాడు. తొలుత రాష్ట్రా స్థాయిలో పోటీల్లో పతకాలు సాధించి.. 2019 తాస్కాండ్ లో జరిగిన యూత్ ఏషియన్ గేమ్స్​లో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 2020,21లో బుద్దగయ, భువనేశ్వర్ లో జరిగిన జాతీయ పోటీలలో ఐదు జాతీయ రికార్డులను నెలకొల్పాడు.

మెక్సిలోనూ స్వర్ణం సాధించి. అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల నోయిడా ఛాంపియన్​షిప్​ పోటీల్లో రెండు రజతాలు సాధించాడు గురునాయుడు. ఒకవైపు వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో పతకాలు సాధిస్తూనే.. మరోవైపు చదువులోనూ రాణిస్తున్నాడు. బెల్లాన హారిక.. నోయిడా మీట్ లో తొలిసారి పాల్గొన్నా.. సత్తా చాటింది. బంగారు పతకంతో ప్రతిభ చూపింది. ఇప్పటికే ఖేలో ఇండియా జాతీయ స్థాయి పోటీలలో రజత పతకం సొంతం చేసుకుంది. తల్లిదండ్రులు శ్రీను, గౌరి రోజు కూలీ పనులు చేసుకుంటూ హారికను వెయిట్ లిఫ్టింగ్ సాధన చేయిస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది హారిక.

Young Swimmer Avighna: 14 ఏళ్ల వయసులో 200 పతకాలు.. స్విమ్మింగ్​లో అవిఘ్న సత్తా..

వ్యవసాయ కుటంబానికి చెందిన శనపతి పల్లవి ఎనిమిదేళ్ల నుంచి వెయింట్ లిఫ్టింగ్ సాధన చేస్తోంది. ఇంజనీరింగ్ చదువుతున్న ఈ అమ్మాయి.. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తోంది. నెల్లిమర్ల మండలం కొండవెలగడకు చెందిన పల్లవి.. గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్ని చూసి స్ఫూర్తి పొందింది. అప్పటి నుంచి గ్రామంలోని కోచ్ చల్లా రాము వద్ద శిక్షణ తీసుకుంటోంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఒ‍కానొక దశలో మానేద్దామనుకుంది. ఆ సమయంలో కోచ్ రాము.. స్థానికులతో మాట్లాడి ఆర్థిక సహాయం అందేలా చేశారు.

2020లో అసోం రాష్ట్రం గౌహతిలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో కాంస్యం, 2021లో ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన జాతీయ యూత్, జూనియర్స్ ఛాంపియన్​షిప్​లో రజితం, అదే ఏడాది భువనేశ్వర్ జరిగిన జాతీయ యూత్, జూనియర్, సీనియర్ విభాగాల్లో బంగారు, రెండు రజత పతకాలు సొంతం చేసుకుంది. 2022లో హరియాణా, ఉజ్బెకిస్థాన్ లో నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్, తాజాగా నోయిడాలో జరిగిన ఏషియన్ జూనియర్స్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది.

మొదట్లో సరదాగా ప్రాక్టిస్ చేసేదాన్ని.. పతకాలు సాధించటంతో నాలో ఉత్సాహం పెరిగింది. రైల్వేలో ఉద్యోగం వచ్చినా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని చేరలేదు. రాబోయే కామన్వెల్త్ పోటీల్లో పతకమే నా లక్ష్యం. -పల్లవి.

Interview with IFS first ranker: సామాజిక మాధ్యమాలకు దూరం.. ఫలితంగా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్..!

కొండవెలగడ వెయిట్ లిఫ్టింగ్ శిక్షణా కేంద్రం శిక్షకుడు.. తమ క్రీడాకారుల ప్రతిభపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత ప్రోత్సహం అందించి.. తగిన సౌకర్యాలు కల్పిస్తే ఈ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విజయనగరం జిల్లా వెయిట్ లిఫ్టింగ్ వర్తమాన క్రీడాకారులు.. రానున్న ఒలింపిక్ పోటీలలోనూ సత్తా చాటేందుకు కఠోర సాధన చేస్తున్నారు. పేదరికం.. అరకొర వసతుల వంటి సమస్యలన్నింటినీ అధిగమించి.. లక్ష్యం దిశగా సాగుతుండటం అభినందనీయం.

తండ్రి కళ్లలో ఆనందం కోసం.. సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడో కుమారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.