విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు... 26 నెంబరు జాతీయ రహదారి నుంచి వేయనున్న అప్రోచ్‌రోడ్డుకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ భూసేకరణ, నష్ట పరిహారం, నిర్వాసితుల సమస్యలు, న్యాయపరమైన అంశాలపై సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జాతీయ రహదారి నుంచి ట్రంపెట్ ఆకారంలో ఎయిర్‌పోర్టుకు అప్రోచ్‌రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ రోడ్డుకు ఇటీవలే సర్వే పూర్తయ్యిందని, అలాగే భూసేకరణను కూడా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పరిహారం నిమిత్తం ఇటీవలే ప్రభుత్వం రూ.110 కోట్లు మంజూరు చేసిందన్నారు. అన్ని అంశాలను మరోసారి పరిశీలించి.... ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి