విజయనగరం జిల్లాలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా అడుగు కూడా ముందుకు పడలేదు. విజయనగరం మండలం గాజులేరగ పంచాయతీ, ఏయూ ప్రాంగణ సమీపంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతిలో ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ అయిదు ఎకరాల్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని రూ.75.26 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. వాస్తవానికి పదేళ్ల కిందటే ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అప్పటి విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దీన్ని తీసుకురావాలని భావించారు. ఎన్‌సీఎస్ థియేటర్ సమీపంలో స్థలాన్ని చూడటం.. దాన్ని ఆమోదించడం అంతా చకచకా జరిగిపోయాయి. తీరా ఆ స్థలంపై న్యాయస్థానంలో కేసు ఉండటంతో మరొక చోట కడదామనుకున్నారు. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర కారణాలతో ప్రతిపాదనలేక పరిమితమైంది. ఇప్పుడు మరోసారి కదలిక వచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
*గతేడాది డిసెంబరు 19న ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.జయరాం అన్నమాటలివి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ కూడా హాజరయ్యారు.
*విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో 1150 కర్మాగారాలు ఉన్నాయి. 1.50 లక్షల మంది కార్మికులున్నారు. వీరంతా వైద్యం కోసం విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక విజయనగరంలోనే మరెుగైన సేవలు అందుతాయి.
*వైద్య కళాశాల జిల్లా ప్రజల కల. గత ప్రభుత్వ హయాంలో చెల్లూరు లెప్రసీ మిషన్ ప్రాంగణంలో నిర్మించాలనుకున్నా ఆచరణలోకి రాలేదు. తర్వాత చింతలవలస సమీపంలో మాన్సాస్ స్థలంలో, ట్యాంకు బండ్ రోడ్డులోని పెద్ద చరెువు ఆయకట్టు కింద ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. పట్టణం విస్తరిస్తున్నందున శివారులో కళాశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో కేంద్ర ఆసుపత్రినే విస్తరించి అందులోనే కట్టాలని అనుకున్నారు. భవిష్యత్తు అవసరాలు, జనాభా దృష్ట్యా ఇది కూడా చాలదనుకున్నారు. ఇంతలో ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిపోయింది.ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారుల సమావేశంలో విజయనగరంలో వైద్య కళాశాల నిర్మాణానికి టెండర్లు పిలవాలని అనడంతో మళ్లీ దీనిపై చర్చ మొదలైంది.
పది నెలలు గడిచినా..
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులు తొలుత కేంద్ర ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి, పక్కనే ఉన్న పీటీసీ స్థలాన్ని కొంత తీసుకోవాలనుకున్నారు. దీనిపై పోలీసు వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆ తర్వాత జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కేంద్ర ఆసుపత్రితో పాటు ఏయూ కొండ, జేఎన్‌టీయూ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించి ఎక్కడైతే బాగుంటుందో అందరూ ఆలోచించి నివేదిక పంపించాలని నాని చప్పొరు. ఆ మేరకు మంత్రి బొత్స ఏయూ కొండపై స్థలాన్ని పరిశీలించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి, దాని పక్కన జర్నలిస్టు కాలనీ, ఆర్మీ జవానుల కాలనీలు పోగా మిగిలిన 80 ఎకరాలను కళాశాలేక కేటాయించాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్‌ను ఆదేశించారు. ఇదంతా జరిగి సుమారు పది నెలలు గడిచినా కదలిక లేదు.
డాక్యుమెంటేషన్ అయ్యాకే పనులు
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ఇది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ పక్కాగా అయ్యాకే పనులు చేపడతారు. ఒక్కసారి పనులు మొదలైతే ఆగే ప్రసేక్త లేదు. ఆసుపత్రి పూర్తయితే రెండు జిల్లాల ప్రజలకు వరమవుతుంది.
- పీఎస్‌రావు, కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రబంధకుడు
త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు....
ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఖరారు కావాల్సి ఉంది. సుమారు రూ.269 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. పరిపాలన ఆమోదం కూడా లభించింది. ఏయూ కొండ మీద స్థలానికి ఆమోదం లభించింది. త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు 500 పడకలతో దీనిని నిర్మించనున్నారు.
- డాక్టర్ నాగభూషణరావు, ప్రభుత్వ వైద్య కళాశాల కమిటీ కన్వీనర్
ఇదీ చదవండి: