సచివాలయాల ఖాళీల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రాతపరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా సంయుక్త పాలనాధికారి డాక్టర్ మహేష్ కుమార్.. సిబ్బందిని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల ప్రత్యేకాధికారులతో... కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు.
పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించే గన్‌లను ఏర్పాటు చేసి, తనిఖీ చేసిన తరువాతే అభ్యర్థులను లోనికి పంపించాలని సూచించారు. కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: