ETV Bharat / state

'జిల్లాలో కరోనా రెండో దశ వ్యాప్తిపై 50రోజుల ప్రత్యేక ప్రచారం'

author img

By

Published : Nov 30, 2020, 10:29 PM IST

కరోనా రెండో దశ వ్యాప్తిని అడ్డుకునేందుకు విజయనగరం జిల్లా పాలనాధికారి సిద్ధమయ్యారు. 37శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు 50రోజుల ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని చేపట్టారు. ఒక్క కేసు కూడా లేకుండా చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని తాజా పరిస్థితులను వివరిస్తూనే రాబోయే రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

vizianagaram-district-collecto
కలెక్టర్ హరి జవహర్ లాల్

విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు 50రోజుల‌ ప్ర‌త్యేక ప్ర‌చార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్థానిక కలెక్టర్ హరి జవహర్ లాల్ వెల్లడించారు. కోవిడ్‌ను ఎదుర్కోవటంలో జిల్లా యంత్రాంగం మెరుగ్గా ప‌నిచేసింద‌ని గుర్తుచేశారు. వివిధ‌ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో, ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌ను అమలు చేసినందుకే మహమ్మారిని అదుపు చేయ‌గ‌లిగామ‌ని వివరించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య త‌గ్గిపోతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆయన కోరారు. ఉత్త‌రాది, ద‌క్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ రెండోద‌శ మొద‌ల‌య్యింద‌ని హెచ్చరించారు. కేసుల సంఖ్య‌ను పూర్తిగా త‌గ్గించి జిల్లాను గ్రీన్‌జోన్‌గా మార్చ‌డమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రెండో ద‌శ మొద‌ల‌వ్వ‌కుండా త‌గిన చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నామ‌ని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు 37శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో 50రోజుల ప్ర‌త్యేక ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

ఇతర జిల్లాలతో పోలిస్తే...

ఇత‌ర జిల్లాల‌తో పోలిస్తే విజ‌య‌న‌గ‌రంలో కరోనా ప్రభావం అతి త‌క్కువ‌గా ఉందని కలెక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. పాజిటివిటీ రేటు 7.4శాతం కాగా.. మ‌ర‌ణాలు కేవ‌లం 0.5శాతం ఉన్నట్లు వెల్లడించారు. ఇప్ప‌టివ‌ర‌కు 204 మంది వైరస్​తో మృతిచెందారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,54,059 కొవిడ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌గా.. 40,784 కేసులు న‌మోద‌య్యాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం 154 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. కొవిడ్ రెండోద‌శ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని ఆయన కోరారు.

ఇదీ చదవండి:

'ప్రైవేట్ అద్దె బస్సు డ్రైవర్లను ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.