![విజయనగరంలో విశాఖ రేంజ్ డీఐజీ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8357443_174_8357443_1596985697980.png)
కరోనా కష్టకాలంలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్. కె.వి.రంగారావు అన్నారు. విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల, చింతలవలస 5వ బెటాలియన్ శిక్షణ కేంద్రాన్ని ఆ జిల్లా ఎస్పీ రాజకుమారితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడే శిక్షణ పొందుతున్న పోలీసు ట్రైనీలతో మాట్లాడారు. వారికి కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం 85 శాతం కరోనా సోకిన వ్యక్తులలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదన్నారు. కాబట్టి మనం బయట విధులు నిర్వహించేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు.
విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన తరువాత కుటుంబ సభ్యులను నేరుగా కలవకూడదన్నారు. స్నానం చేసిన తరువాతనే కుటుంబ సభ్యులను కలవాలన్నారు. పోలీసు ఉద్యోగులందరూ ఆరోగ్యంగా ఉండాలనేది డీజీపీ గౌతమ్ సంవాంగ్ ఆకాంక్షన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇవీ చదవండి