ETV Bharat / state

cinema shooting: సినిమా షూటింగ్ లో విశాఖ ఎంపీ - విజయనగరం జిల్లా ముఖ్యంశాలు

విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ శృంగవరపుకోట మండలంలో జరిగిన సినిమా షూటింగ్​లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జీవితం చరిత్ర ఆధారంగా 'ఒకే ఒక్కడు అల్లూరి సీతారామరాజు' సినిమా షూటింగ్ లో ఎంపీ బ్రిటీష్ తహసీల్దార్ సెబాస్టియన్ పాత్ర పోషిస్తున్నారు.

సినిమా షూటింగ్ లో విశాఖ ఎంపీ
సినిమా షూటింగ్ లో విశాఖ ఎంపీ
author img

By

Published : Aug 31, 2021, 1:00 AM IST

విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర సమీప జిందాల్ మెట్ట వద్ద జరిగిన సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జీవితం చరిత్ర ఆధారంగా 'ఒకే ఒక్కడు అల్లూరి సీతారామరాజు' సినిమా షూటింగ్ లో ఎంపీ బ్రిటీష్ తహసీల్దార్ సెబాస్టియన్ పాత్ర పోషిస్తున్నారు. గిరిజనులను వేధించే తహసీల్దార్ పాత్రలో ఎంపీ కనిపించనున్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ తమ సినిమా అల్లూరి సీతారామరాజు నిజ జీవితం ఆవిష్కరిస్తుందన్నారు. తహసీల్దార్ పాత్రలో ఎంపీ నటించడం విశేషమన్నారు.

సినిమా షూటింగ్ లో విశాఖ ఎంపీ
సినిమా షూటింగ్ లో విశాఖ ఎంపీ

ఎంపీ మాట్లాడుతూ... ఎంతో గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు నిజ జీవిత చరిత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా అల్లూరి జీవితం ఎంతో గొప్పదన్నారు. ఆయన గిరిజనుల కోసం చేసిన పోరాటాలు గొప్పవన్నారు. అటువంటి సినిమాలో నటించడం మర్చిపోలేని ఘట్టమన్నారు. అల్లూరి జీవితంను దర్శకుడు వెంకట్ తెరకెక్కిస్తున్న తీరు చాలా బాగుందన్నారు. షూటింగ్ లో పాల్గొన్న ఎంపీని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండి:

AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 878 కరోనా కేసులు.. 13 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.