విజయనగరం జిల్లాలో ఫొని తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. గంటకు 40 నుంచి 90 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. మత్స్య కారులను చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశామన్నారు.
ఇప్పటికే 28 మందితో కూడిన సహాయ బృందం జిల్లాకు చేరుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. తీర ప్రాంత మండలాలైన పూసపాటి రేగ, భోగాపురం మండలాలో హై అలర్ట్ ప్రకటించామన్నారు. మిగిలిన అన్ని మండలాల్లోనూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. తుఫాన్‌పై ఎప్పటికప్పుడు సమాచారం, సహాయ కార్యక్రమాల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి