ETV Bharat / state

రాముడి విగ్రహం ధ్వంసం కేసును త్వరలోనే ఛేదిస్తాం: ఎస్పీ రాజకుమారి - రామతీర్థం విగ్రహం ధ్వంసం అప్​డేట్స్

విజయనగరంజిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం కేసులో ఐదుగురు నిందితులను అదుపులో తీసుకున్నాట్లు జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. కేసును ఛేదించడానికి ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించినట్లు తెలిపారు.

vijayanagaram  sp rajakumari on ramatheertham temple
ఎస్పీ రాజకుమారి
author img

By

Published : Dec 31, 2020, 8:37 PM IST

విజయనగరంజిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం కేసును త్వరలోనే ఛేదిస్తామని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. వార్షిక నేర నివేదిక మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు ఎస్పీ సమాధానం ఇస్తూ.. ఘటనకు సంబంధించిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. కేసును ఛేదించేందుకు ఐదు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. సీసీఎస్, క్రైం డీఎస్పీల ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొంత కీలక సమాచారం సేకరించామని... ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సంవత్సరాంతంలో జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవటం దురదృష్టకరమని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు.

రాముడి విగ్రహం ధ్వంసం కేసుపై ఎస్పీ రాజకుమారి

ఇదీ చదవండి: రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.