విజయనగరం జిల్లాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై అధికారులు సమావేశమయ్యారు. ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారి గణపతిరావు ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని..మాస్క్, శానిటైజర్‌తో అభ్యర్థులు హాజరు కావాలని అన్నారు. కొవిడ్ బాధితుల కోసం ఒక ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
వైద్య శాఖ థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీటింగ్ ఏర్పాట్లు, ఇన్విజిలేటర్లను, టాబ్ కనెక్షన్స్‌కు విద్యుత్, జనరేటర్‌ను కాలేజీ యాజమాన్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ పరిశీలకులు శంకరరావు, ఈశ్వరి, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో మాఫియా శక్తులు స్వైర విహారం'... డీజీపీకి చంద్రబాబు లేఖ