ETV Bharat / state

పుర పోరుకు అధికారుల ఏర్పాట్లు.. ప్రచారంలో అభ్యర్థులు తలమునకలు - సాలూరు వార్తలు

విజయనగరం జిల్లాలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సాలూరు పురపాలికలో వైకాపా ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీ ఎంపీ గొట్టేటి మాధవి, ఎమ్మెల్యే రాజన్న దొర ప్రచారంలో పాల్గొన్నారు.

commissioner
విజయనగరంలో పుర పోరుకు ఏర్పాట్లు .. ప్రచారంలో అభ్యర్థుల తలమునకలు
author img

By

Published : Mar 6, 2021, 9:08 PM IST

విజయనగరం జిల్లాలో పురపాలక ఎన్నికలు, నిబంధనలపై అభ్యర్థులకు అధికారులు అవగాహన కల్పించారు. ఆనంద గజపతి కళాక్షేత్రంలో నగరపాలక సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్​ వర్మ, పలువురు పోలీసు అధికారులు, వివిధ రాజకీయ పక్షాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు పాల్గొన్నారు.

విజయనగరం నగర పాలక సంస్థ ఎన్నికకు సంబంధించి ఐదో వార్డులో పోటీలో ఉండి మరణించిన కాంగ్రెస్ అభ్యర్థి స్థానంలో మరొకరిని పోటీకి అనుమతిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసినట్టు కార్పొరేషన్ కమిషనర్ ఎస్.ఎస్. వర్మ తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున మరొక అభ్యర్థి ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సంబంధిత డివిజన్ రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.

సాలూరులో వైకాపా ప్రచారం..

సాలూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎమ్మెల్యే రాజన్న దొర, పార్లమెంట్ సభ్యులు గొట్టేటి మాధవి పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అభివృద్ధి చేసేందుకు ఈ గెలుపు దోహదపడుతుందన్నారు.

ఇదీ చదవండి: 'విశాఖ స్టీల్​ప్లాంట్ ప్రైవేటీకరణలో భాజపా క్విడ్ ప్రోకోకు పాల్పడింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.