ETV Bharat / state

రామతీర్థం ఘటనకు బాధ్యత వహించి అశోక్​ గజపతి రాజీనామా చేయాలి : విజయసాయి

రామతీర్థం విగ్రహాల ధ్వంసం ముమ్మాటికీ తెలుగుదేశం నేతల పనేనని విజయసాయి రెడ్డి పునరుద్ఘాటించారు. దీనికి నైతిక బాధ్యత వహించి అశోక్​గజపతి రాజు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపా సుభిక్షమైన పాలన ఓర్వలేకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సుపరిపాలన అందిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రామతీర్థం బోడికొండపై జరిగిన ఘటన శోచనీయమన్నారు.

కుట్ర రాజకీయాలకు భయపడం
కుట్ర రాజకీయాలకు భయపడం
author img

By

Published : Jan 2, 2021, 3:10 PM IST

Updated : Jan 2, 2021, 5:19 PM IST

రామతీర్థం విగ్రహాల ధ్వంసం వెనుక తెలుగుదేశం నేతల కుట్ర దాగి ఉందన్నారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేశ్, ఆ పార్టీ నేతలే దీనంతటికీ కారణమని మండిపడ్డారు. మంచి పాలన అందిస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. గతంలోనూ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేశారని... అవన్నీ అబద్దమని తేలిందని వివరించారు.

రామతీర్థం దేవాలయానికి ఛైర్మన్​గా ఉన్న అశోక్​గజపతి రాజు... విగ్రహాల ధ్వంసానికి బాధ్యత వహించాలని వియసాయి రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశంలో కుట్రలో ఆయనకూ భాగం ఉందని ఆరోపించారు. అందుకే ఆయన రాజీనామా చేయాలని అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవాలని ఈ విగ్రహాల ధ్వంసం కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలకు భయపడే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు.

లోకేశ్ సవాల్​కు తాను సిద్ధమని విజయసాయి ప్రకటించారు. విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఎక్కడైనా చర్చకు వస్తానని తెలిపారు. లోకేశ్​ చెప్పినట్టు సింహాచల అప్పన్న సన్నిధిలోనైనా తమకు అభ్యంతరం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

రామతీర్థం ఘటనకు బాధ్యత వహించి అశోక్​ గజపతి రాజీనామా చేయాలి

ఇదీచదవండి

రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్ల దాడి

Last Updated : Jan 2, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.