Bhogapuram Airport Lands: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూముల పరిహారం విషయంలో రైతుల పేరుతో.. వైకాపా నేతలు పరిహారాన్ని కాజేస్తున్నారంటూ బాధిత రైతులు విజయనగరం కలెక్టర్ సూర్యకుమారికి ఫిర్యాదు చేశారు. భోగాపురం మండలం కంచేరుపాలెం, చిట్టిపేట, గూడెపువలస, కౌలువాడ, బైరెడ్డిపాలెంకు చెందిన బాధితులు.. తెదేపా నేతలతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
దశాబ్దాలుగా సాగులో ఉన్న భూముల్లో ఉన్న రైతులకు కాకుండా.. వారి బినామీల పేరుతో అధికార పార్టీ నేతలు పరిహారం కాజేస్తున్నారని ఆరోపించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని.. అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్కు విన్నవించారు. వైకాపా అధికారంలో అర్హులకు న్యాయం జరగటం లేదని బాధితులు వాపోయారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని.. తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఆ దాబాల్లో మద్యం అమ్మొద్దు.. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలి: సీఎం జగన్