ETV Bharat / state

Unemployees Protest: ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ జిల్లాలో నిరుద్యోగ యువత నిరసన - ap latest news

Unemployees Protest: విజయనగరంలో నిరుద్యోగ యువత నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలని.. ఉద్యోగుల విరమణ వయస్సు పెంపును ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

unemployed youth protest in vizianagaram
ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలంటూ జిల్లాలో నిరుద్యోగ యువత నిరసన
author img

By

Published : Feb 5, 2022, 5:53 PM IST

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని.. ఉద్యోగుల విరమణ వయస్సు పెంపును ప్రభుత్వం విరమించుకోవాలని.. విజయనగరంలో నిరుద్యోగ యువత నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో.. విజయనగరం కోట నుంచి గురజాడ అప్పరావు గ్రంథాలయం, మహారాజా కళాశాల మీదుగా గంటస్తంభం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా లక్ష 30వేల ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గతేడాది ప్రకటించిన నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త జాబ్ క్యాలెండ్ విడుదల చేయాలన్నారు. కొత్తగా ప్రకటించిన ఉద్యోగ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Employees Pen-down: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పెన్ డౌన్.. కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.