ETV Bharat / state

TRACTOR ACCIDENT: ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం - చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా

CHAMALAVALASA TRACTOR ACCIDENT
CHAMALAVALASA TRACTOR ACCIDENT
author img

By

Published : Dec 10, 2021, 2:24 AM IST

Updated : Dec 10, 2021, 3:00 AM IST

02:22 December 10

TRACTOR ACCIDENT AT CHAMALAVALASA

TRACTOR ACCIDENT: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో 35 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో 22 మందికి గాయాలు కాగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కిండాం అగ్రహారంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు మెంటాడ మండలంలోని చింతాడవలస వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని., క్షతగాత్రులను గజపతినగరం, విజయనగరం ఆసుపత్రులకు తరలించారు. వీరందరినీ మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్​కు తరలించారు. క్షతగాత్రులల్లో చందక లక్ష్మి, చందక వరలక్ష్మి, సిరపురపు సత్యం, బొగుల సూర్యనారాయణ, చందక కన్నయ్య లతో పాటు మరొకరు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Accident: ఆటోను ఢీకొన్న లారీ.. చిన్నారి మృతి.. వాగులో ఐదుగురు గల్లంతు

Last Updated : Dec 10, 2021, 3:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.