Ramatheertham: విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై నిర్మించిన కోదండరామ ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ సోమవారం ఉదయం 7.37 గంటలకు నిర్వహించనున్నారు. రెండేళ్ల క్రితం కొండపై స్వామి వారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో పురాతన ఆలయాన్ని పునర్నిర్మించి, నూతన విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. ఈ నెల 22 నుంచి పునఃప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి.
ఆదివారం రామతీర్థం ప్రధాన ఆలయంలో ఉన్న నూతన విగ్రహాలను కొండపైకి చేర్చి రుత్వికులు జలాధివాసం నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవంలో మంత్రులు బూడి ముత్యాలనాయుడు, బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, ధర్మకర్తల మండలి ఛైర్మన్ పూసపాటి అశోక్‌గజపతిరాజు తదితరులు పాల్గొంటారని దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు తెలిపారు.
ఇదీ చదవండి: మలేరియా నిర్మూలనలో... ఏపీకి కేంద్ర ప్రభుత్వ పురస్కారం