విజయనగరం జిల్లా సాలూరు మండలం పరిధిలో ఉన్న కురుకుట్టి ఆశ్రమ పాఠశాలలో సుమారుగా 317 మంది విద్యార్థులు ఉండగా.. కేవలం ఒకే ఒక్క వంటమనిషి ఉన్నాడు. పాచిపెంట మండలం వేటగాని వలస ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్న పైడియ్య... ఈ పాఠశాలకు డిప్యూటేషన్‌పై వచ్చాడు. సుమారుగా మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. అతని వయసు 52 సంవత్సరాలు. అన్ని పనులు ఒక్కడే చేసుకుని పిల్లలకు వంట చేసి భోజనాలు అందిస్తున్నాడు. తనకి అదనంగా నలుగురు సహాయకులు కావాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.
ఉపాధ్యాయులు లేనిది... ఉత్తీర్ణత ఎలా..!
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడం.. అదేవిధంగా రాత్రిపూట ఉండడానికి ఒక నైట్ వాచ్మెన్ కూడా లేడు. ఇంతకు ముందు గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయితే.. ఆ సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇంక్రిమెంట్ కట్ చేస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంబేడ్కర్ సూచనలు ఇచ్చారు. కానీ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేకపోతే ఆ విద్యార్థులు ఎలా ఉత్తీర్ణులవుతారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: