విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచే వాసుదేవ్ కోటి 50 లక్షలు ఫైనాన్స్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు అతడు ఫైనాన్స్ కంపెనీకి కోటి రూపాయల వరకు చెల్లించాడు. మిగిలిన సొమ్ము తీర్చలేకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ యజమాని మనోజ్ కుమార్ను సంప్రదించారు. అయితే... మనోజ్ అతడ్ని తప్పుదోవ పట్టించాడు. జీడి పిక్కల కంపెనీలో ఉన్న 24 లక్షల రూపాయల సరకును ఎవరో దొంగిలించినట్లుగా కేసు పెట్టి, ఇన్సూరెన్స్ క్లయిమ్ చెయ్యవచ్చన్న సలహా ఇచ్చాడు.
దీంతో తన కంపెనీలో ఉన్న సరకును ఓ లారీలో లోడ్ చేయించి నర్సీపట్నం గోడౌన్కి తరలించారు. ఆపై తమ సరకు చోరీకి గురైందని డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో అసలు గుట్టురట్టవడంతో లారీలో లోడింగ్ చేసిన ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారులు పరారీలో ఉన్నారు.
ఇదీ చదవండి: వైరల్ కంటెంట్ నియంత్రణకు ఫేస్బుక్ కీలక నిర్ణయం!