విజయనగరం జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన కోటి అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి వీరంగం సృష్టిస్తున్నాడు. ప్రైవేటు బస్సు డ్రైవర్లు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నాడు. హామీని నెరవేర్చాలని దానికోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయనని హెచ్చరిస్తున్నాడు. అప్రమత్తమైన పోలీసులు ..సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సర్ది చెప్తున్నారు. ముందస్తుగా విద్యుత్ నిలిపివేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇదీచూడండి.నేడు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్