విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ సీతానగరం మండలం సువర్ణముఖి నదిపై వేసిన మట్టి రోడ్డులో లారీ దిగబడింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పార్వతీపురం నుంచి ఒడిస్సాకు, విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో లారీలు బస్సులు ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు స్పందించి క్రేన్ సహాయంతో లారీని బయటికి తీశారు. రెండు గంటల అనంతరం వాహన రాకపోకలు పునరుద్ధరించారు.
ఇది చదవండి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు పిల్లలు సహా పది మంది మృతి