విజయనగరం జిల్లా పార్వతీపురంలో భానుడి భగభగమంటున్నాడు. మే నెల రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటాక బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. గత 2రోజులుగా... 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత, 24 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. అత్యవసర పనులకు బయటకు వచ్చేవారు రక్షణ సాధనాలుగా ధరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు నిర్మానుషంగా మారాయి. ఎండ తీవ్రత దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ, ఓఆర్ఎస్ రోగులకు అందజేస్తున్నారు.
వేసవి తాపానికి అల్లాడుతున్న జనం - sunstroke
ఎండలు మండుతున్నాయి. గత 2 రోజులుగా ఉపరితలం వేడెక్కుతోంది. గతేడాదితో పోల్చితే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. రద్దీగా ఉండే ప్రదేశాలు నిర్మానుషంగా మారాయి.