ప్రపంచ దేశాలలో క్రూడాయిల్ ధర తగ్గుతున్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఎక్సైజ్ సుంకం పేర్లతో పన్నులు విధిస్తూ సాధారణ ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో పేదలు, కూలీలు, మధ్య తరగతి ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వేళ.. ప్రభుత్వాలు ఇలా చేయడం సమంజసం కాదన్నారు. వాహన మిత్ర పేరుతో కుడి చేత్తో పది వేలు ఇచ్చి అదనపు సుంకం పేరుతో ఎడమ చేత్తో లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులతో పాటు పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...