క్షత్రియులంతా ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. విజయనగరం క్షత్రియ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి క్షత్రియ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నేత విష్ణుకుమార్‌రాజు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పి.రఘు వర్మ పాల్గొన్నారు.
రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్న భాష సరిగా లేదని అశోక్ గజపతిరాజు అన్నారు. హిందూ మతంపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. బెయిల్‌పై వచ్చిన వ్యక్తికి సింహాచలం భూముల బాధ్యత అప్పగించారని అసహనం వ్యక్తం చేశారు. భూముల సంరక్షణ సంయుక్త కలెక్టర్లకు అప్పగించడం దారుణమని అశోక్ గజపతిరాజు అన్నారు.
ఇదీ చదవండి: ఈ - వాచ్ యాప్.. ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ