తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో తెదేపా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ కూడలి వద్ద నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ ఆర్పీ.భంజ్ దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు.
గరివిడి మండలంలో..
గరివిడి మండలంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన నేతలు.. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రెడ్డి గోవిందా, బలరాం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇళ్లపైనే తెదేపా జెండాల ఆవిష్కరణ..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కురుపాం నియోజకవర్గంలోని మండలాల్లో పార్టీ కార్యాలయాల వద్ద తెదేపా జెండా ఎగరవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చినమేరంగిలో తెదేపా జెండా ఎగరవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకొన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇళ్లపైనే తెదేపా జెండాలు ఎగరవేశారు. పలుచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేకులు కట్ చేశారు.
ఇదీ చదవండి:
తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దే: చంద్రబాబు