ETV Bharat / state

ఉద్యోగాలు కావాలంటే... ఇక్కడ చేరండి..!

ఉద్యోగం చేయాలంటే... శిక్షణ తీసుకోవాలి. ముఖాముఖికి హాజరుకావాలి. ఈ భయాలే విద్యార్థుల్లో చూస్తుంటాం. కానీ ఓ కళాశాల విద్యార్థులకు మాత్రం అలాంటి భయమేం లేదు. కాలేజీకి వెళ్లామా..! ఎన్​సీసీలో ప్రవేశం పొందామా.. అంతే..! ఇంకా... ఉద్యోగం సాధించొచ్చు అని ధీమాగా ఉంటారు. రక్షణశాఖలో ప్రతి ఏటా అక్కడి విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తూ... ఆదర్శంగా నిలుస్తున్నారు.

శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్​సీసీ విద్యార్థులు
author img

By

Published : Nov 24, 2019, 5:47 PM IST

ఉద్యోగాలు కావాలంటే... ఇక్కడ చేరండి..!

విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో... ఎన్​సీసీ విభాగం విద్యార్థులు రక్షణశాఖ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. జిల్లాలో 6 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా... ఒక్క ఎస్.కోట కాలేజీలో మాత్రమే ఎన్​సీసీ విభాగం ఉంది. ఇక్కడ శిక్షణ పొంది బీ, సీ ధ్రువపత్రాలు సాధించిన క్యాడెట్లు... రక్షణశాఖ నిర్వహిస్తున్న పరీక్షల్లో సత్తా చాటుతున్నారు.

బీ, సీ పత్రాలు సాధించిన వారికి రక్షణ శాఖ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఉంది. ఫలితంగా సులువుగా కొలువు దక్కించుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే... ఈ కళాశాల విద్యార్థులు రక్షణ శాఖ ఉద్యోగాలకు కేరాఫ్​గా మారారు. 2002లో ప్రారంభమైన ఎన్​సీసీ విభాగం ద్వారా... ప్రతిఏటా పదిమందికి తక్కువ కాకుండా జాబ్​లో జాయిన్ అవుతున్నారు.

తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఆర్మీ ర్యాలీలో 9 మంది ఇక్కడి విద్యార్థులే ఎంపికవ్వడం విశేషం. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. రాధాకృష్ణ మాట్లాడుతూ... ఎన్​సీసీలో చేరడం ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగాలు సాధిస్తున్నారని... ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్​సీసీ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో క్యాడెట్లు... ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు.

ఇదీచూడండి.అధికారుల నిర్లక్ష్యం... సమస్యల వలయంలో వసతిగృహం

Intro:విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఎన్ సి సి విభాగం విద్యార్థులు రక్షణశాఖ ఉద్యోగాల్లో ఎంపిక అవుతున్నారు జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా ఒక్క ఎస్ కోట కళాశాలలో మాత్రమే ఎన్ సి సి ఇ విభాగం నడుస్తుంది

Body:ఈ విభాగంలో శిక్షణ పొంది బి సి ధ్రువ పత్రాలు సాధించిన క్యాడెట్లు రక్షణ శాఖ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న ఎందుకు లో పాల్గొని ఉద్యోగాలు సాధిస్తున్నారు ఈ విభాగంలో బి సి ఇ పత్రాలు సాధించిన వారికి రక్షణ శాఖ ఉద్యోగాల ఎంపికలో ప్రత్యేక కోటా ఉంటుంది దీని ద్వారా సులువుగా ఉద్యోగాలు సాధిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ కళాశాల విద్యార్థులు రక్షణ శాఖ ఉద్యోగాలు కేరాఫ్గా మారారు

Conclusion:2002లో ప్రారంభమైన ఎన్ సి సి విభాగం ద్వారా ప్రతి ఏటా పదిమందికి తక్కువ లేకుండా రక్షణశాఖ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఆర్మీ ర్యాలీ లో తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ కళాశాల లో ఉన్న ఎన్ సి సి ఇ లో చేరడం ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగాలు సాధిస్తున్నారు ఈ అవకాశాన్ని ఈ ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు ఆదివారం ఎన్ సి సి దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో క్యాడెట్లు తొమ్మిది మంది తాజాగా ఆర్మీ ఉద్యోగాలకు ఎంపిక కావడం సంతోషదాయకం అన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.