ETV Bharat / state

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో డే కేర్ సెంటర్​ - పార్వతీపురంలో డేకేర్ సెంటర్​

తలసేమియా, సికిల్ సెల్ అనీమియా ప్రాణాంతక వ్యాధులుగా పరిణమించాయి. జన్యు సంబంధమైన ఈ వ్యాధులు.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వైద్య ఖర్చులూ తడిసి మోపెడవుతున్నాయి. కేవలం రక్తమార్పిడి కోసమే.. ప్రతినెల ఎన్నో వ్యయ ప్రయాసలకు పడుతున్న దుస్థితి. కళ్ల ముందే.. మృత్యువుతో పోరాడున్న తమ పిల్లలను కాపాడుకునేందుకు బాధిత పిల్లల తల్లిదండ్రులు పడే యాతన వర్ణనాతీతం. ఈ క్రమంలో నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీడీఏల పరిధిలోని గిరిజన గ్రామాల బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డే కేర్ సెంటర్​ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే ప్రథమంగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా బాధితులకు చేకూరుతున్న ప్రయోజనలపై ప్రత్యేక కథనం.

day care center
డే కేర్ సెంటర్​
author img

By

Published : Apr 12, 2021, 7:42 AM IST

తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బారినపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏడాదికి పదివేల మంది ఈ వ్యాధితో జన్మిస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు వేల మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మరింత అధికంగా ఉండొచ్చు. ప్రధానంగా చిన్నారుల పాలిట ప్రాణాంతకరంగా మారింది ఈ వ్యాధి. ఒక్కసారి సోకితే., జీవితాంతం వారిని పీల్చిపిప్పి చేసే రక్త పిశాచి వ్యాధి ఇది. దురదృష్ణం ఏమిటంటే.. కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది.

పార్వతీపురం డే కేర్ సెంటర్​

వ్యాధి తీవ్రత..

ఈ వ్యాధి బారినపడిన వారిలో క్రమంగా రక్త నిల్వలు పడిపోతాయి. శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. ఉత్పత్తి జరిగినా.. ఎక్కువ కాలం శరీరంలో ఉండదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పతనమవుతాయి. రక్తం శాతం పతనమైన ప్రతిసారి కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. ఇలా తరచూ రక్తం ఎక్కించటం వల్ల బాధితుల్లో ఐరన్ నిల్వలు పెరిగిపోతు.. కాలేయం, మూత్రపిండాలు, గుండె దెబ్బతినటం మొదలౌతుంది. ఈ పరిస్థితుల్లో బాధితుల చిన్నారులకు రక్తం ఎక్కించిన ప్రతిసారి ల్యూకో డీప్లీషన్ ఫిల్టర్స్ ద్వారా రక్త శుద్ధి చేయాలి. దాత నుంచి స్వీకరించిన రక్తంలోని ఐరన్​ను తొలగించి, హిమోగ్లోబిన్ మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది. దీనితో పాటు.. ఐరన్, కెలేషన్ థెరఫి జరగాలి.

అంతేకాదు.. ఆరు నెలలకు ఒకసారి... ఐరన్ స్థాయిలు తెలుసుకోవాలి. మూత్రపిండాలు, గుండె పనితీరునీ పరీక్షిస్తూ ఉండాలి. ఈ వైద్య సేవలకు నాలుగైదు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. రోజుల తరబడి పట్టణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతూ.. ఆర్థికంగా పతనమౌతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీడీఏ పరిధిలోని బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ప్రయోగాత్మకంగా డే కేర్ సెంటర్​ను ఏర్పాటు చేసింది.

సంక్షేమ వసతి గృహాల విద్యార్థులే అధికం..

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 27,758మందికి రక్త పరీక్షలు చేయగా అందులో 397 మంది సికెల్ సెల్ అనేమియా, తలసేమియాలతో బాధపడుతున్నట్లు వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది గుర్తించారు. ఇందులో 237మంది విద్యార్ధులు, 30మంది యువతులు, 130మంది గర్భిణీలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇందులో 173మంది గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల విద్యార్ధులే ఉండటం గమనార్హం. సర్వేలో గుర్తించిన బాధితులకు ఈ డే కేర్ కేంద్రంలో రక్తం ఎక్కించి చికిత్స అందిస్తున్నారు. 400 మందిలో 89 మందిని అత్యధిక ప్రమాద కేసులుగా గుర్తించి వారికి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి రక్తం ఎక్కిస్తున్నారు. ఇప్పటివరకు 34మందికి కొత్త రక్తం ఎక్కించి చికిత్స అందించారు. సర్వేలో గుర్తించిన మిగిలిన వారికి ప్రతినెలా పరీక్షలు చేసి వారిలో 8శాతం కంటే తక్కువ హిమోగ్లోబిన్ శాతం ఉన్నవారికి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ఇలాంటి బాధితులందరికి ఈ డే కెర్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్నారు.

బాధితుల స్పందన..

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏరియా ఆసుపత్రిలో తలసెమియా, సికిల్ సెల్ అనీమియా చికిత్స కోసం డే కెర్ సెంటర్ ఏర్పాటుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందటమే కాకుండా.. ప్రయాణ, ఇతరాత్ర ఖర్చుల ఆర్థిక భారం తప్పిందంటున్నారు. అంతేకాక నగరాల్లోని జిల్లా కేంద్ర వైద్యశాలలకు పరుగులు పెట్టాల్సిన యాతన తప్పిందంటున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్థుల సంఖ్య నానాటికి అధికమవుతున్న తరుణంలో బాధితులకు అండగా నిలిచేందుకు, వైద్య సేవలను మరింత చేరువగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టం అభినందనీయమంటున్నారు.

ఇదీ చదవండీ.. ఆంజనేయులు క్షేమం.. సీఎం ఇంటి వద్ద గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.