ETV Bharat / state

గిరిశిఖర వసతి గృహాలు... గర్భిణులకు అమృత హస్తాలు

మాతాశిశు మరణాలను తగ్గించేందుకు, పోషకాహార లోపాలు అధిగమించేందుకు విజయనగరం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న గర్భిణుల వసతి గృహాలు.. నీతి ఆయోగ్ దృష్టిని ఆకర్షించాయి. జిల్లాలోని పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వినూత్నంగా నడుస్తున్నాయీ కేంద్రాలు. ఇక్కడ గర్భిణులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి ఈ వసతి గృహాలు చూసి... ఇదే ఆలోచన దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేనా పార్వతీపురం ఐటీడీఏలో వసతి గృహాల నిర్వహణకు ఆర్థిక సహకారం అందించడానికి హామీ ఇచ్చారు.

ఆదర్శం.. ఈ వసతి గృహం
author img

By

Published : Apr 26, 2019, 7:09 AM IST

ఆదర్శం.. ఈ వసతి గృహం

గిరిజన ప్రాంతంలో సరైన సదుపాయాల్లేక మాతాశిశు మరణాలు ఎక్కువ. రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఘోరం. వీటి అదుపు కోసం పార్వతీపురం ఐటీడీఏ వినూత్నంగా గర్భిణులకు వసతి గృహాలు ఏర్పాటు చేసింది. ఐటీడీఏ పీవో లక్ష్మీశ ఆలోచనకు ప్రతిరూపమే గుమ్మలక్ష్మీపురం, సాలూరులోని ఈ గృహాలు. ఈ కేంద్రంలో 8 నుంచి 9 నెలలలోపు ఉన్న గర్భిణీలకు సకల సౌకర్యాలు కల్పిస్తారు. ఓ ఆరోగ్య కార్యకర్త 24 గంటలూ ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఓ వాహనం సిద్ధంగా ఉంటుంది. పురిటినొప్పులు వచ్చినా... అనారోగ్యంపాలైనా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్తారు. ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు, రోజూ మెను ప్రకారం పోషకాహారం అందిస్తున్నారు. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయిస్తారు. ఒక్కో గర్భిణీకి నెలకు సగటున 3వేలు ఖర్చుచేసి సురక్షిత ప్రసవాలనకు బాటలు వేస్తున్నారు. ఇలాంటి ప్రసవాలు సాలూరులో వందకుపైగా జరిగితే గుమ్మలక్ష్మీపురం వంద మార్కు అందుకుంది

నీతిఆయోగ్ బృందం సందర్శన
సాలూరు, గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన గిరిశిఖర వసతి గృహాలను కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి సందర్శించారు. ఇదే విధానాన్ని గిరిజన ప్రాంతంలో అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు నీతి అయోగ్ ప్రతినిధుల బృందం... ఈ గృహాలను ఇటీవలే పరిశీలించారు. వసతి గృహాల ఏర్పాటు, అమలు తీరు, ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసి... దేశవ్యాప్త అమలకు ప్రతిపాదిస్తామన్నారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు.
పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో సాలూరు, గుమ్మలక్ష్మీపురంలో నడుస్తున్న గిరిశిఖర గర్భిణుల వసతి గృహాలు నీతి అయోగ్ మెప్పు పొందగలిగితే దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు వీలు కలుగుతుంది. ఇదే జరిగితే పార్వతీపురం ఐటీడీఏ దేశానికి ఆదర్శప్రాయం కానుంది.

Intro:ఈశ్వరాచారి...గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

యాంకర్... ఆరోగ్యకర భారతదేశంగా మన దేశాన్ని మళ్లీబి అగ్రస్థాయి లో నిలబడడానికి వైద్యులు కృతనిశ్చయంతో పనిచేయాలని కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ భారత ముఖ్య సలహాదారు డాక్టర్ కొండవీటి మురళి కోరారు. గుంటూరు నగరానికి చెందిన కైట్స్ స్లిమ్మింగ్ ఫిజియోథెరపీ కాస్మొటాలజీ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ వి వి మంజుల కుమారికి ఆయన కంట్రీ బుక్ ప్రపంచ రికార్డు ను ప్రధానం చేశారు. గుంటూరు కైట్స్ క్లినిక్లో ఏర్పాటు చేసిన రికార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అగ్ర దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలను కుంగదీస్తున్న ఒబేసిటీ నుంచి కాపాడడానికి డాక్టర్ మంజుల కుమారి లాంటి వైద్యులు చేస్తున్న కృషిని ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వరల్డ్ రికార్డ్స్ హెల్ప్ డెస్క్ ను ఉపయోగించుకొని భారతదేశాన్ని ముఖ్యంగా తెలుగు ప్రాంతాన్ని రికార్డుల్లో అగ్ర భాగాన నిలపాలని డాక్టర్ మురళి కోరారు. వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల కుమారి మాట్లాడుతూ తమ క్లినిక్ లో అత్యున్నత ప్రమాణాలతో చేస్తున్న చికిత్సలకు ప్రపంచ రికార్డు రావడం గర్వకారణంగా ఉందన్నారు.

Body:బైట్..... డాక్టర్ కొండవీటి మురళి ... కంట్రీ బుక్ క్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ భారత ముఖ్య సలహాదారు.

బైట్.... డాక్టర్ వి వి మంజుల కుమారి... కైట్స్ స్లిమ్మింగ్ ఫిజియోథెరఫీ కాస్మొటాలజీ క్లినిక్ డైరెక్టర్.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.