విజయనగరం జిల్లా గరివిడిలో సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎస్పీ బాలు విగ్రహాన్ని ప్రతిష్టించారు. స్థానిక ఉపాధ్యాయ కాలనీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాధిక మెటల్ మినరల్ కంపెనీ అధినేత మన్విదర్ మోహర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.
భౌతికంగా లేకపోయినా..
ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను తన గాన గాంధర్వంతో ఓలలాడించిన బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా లేకపోయినా, ఆయన సంగీత బాణీలు ప్రజలను ఉర్రూతలూగిస్తూనే ఉంటాయన్నారు.
నిత్యం స్మరించుకునేందుకే..
5 దశాబ్దాలపాటు సంగీత ప్రపంచానికి సేవలందించిన ఎస్పీ బాలు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు వాకాడ శ్రీనివాసరావు కంటతడి పెట్టారు. పాటసారి బాలును నిత్యం స్మరించుకునేందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'బాపూజీ స్ఫూర్తితో పూర్తిస్థాయి రాజధానిని సాధిస్తాం'