ETV Bharat / state

Ashok Gajapathi: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులుగా ఎవరిని నియమించినా ఓకే..కానీ ! - మాన్సాస్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ అశోకగజపతి రాజు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు తాము వ్యతిరేకం కాదని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోకగజపతి రాజు తెలిపారు. కాకపోతే ట్రస్టు బోర్డు ఆనవాయితీలను కొనసాగించాలని ఆయన కోరారు. ట్రస్టు బోర్డు సభ్యులుగా అందరూ మహిళలనే తీసుకుంటే ఎవరైనా కాదన్నారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Should continue to follow The Board of Trust ...
ట్రస్టుబోర్డు ఆనవాయితీలను కొనసాగించాలి...
author img

By

Published : Sep 3, 2021, 7:25 PM IST

Updated : Sep 3, 2021, 8:33 PM IST

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, బోర్డు సభ్యులుగా ఎవరిని నియమించినా ఓకే..కానీ !

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌, బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు స్పష్టం చేశారు. కాకపోతే ట్రస్టు ఆనవాయితీలను పాటించే విషయంలో అడ్డు రాకూడదన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులుగా అందరూ మహిళలనే తీసుకుంటే ఎవరైనా కాదన్నారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని వెల్లడించారు. ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అర్థరహితంగా ఉందని ఆక్షేపించారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ట్రస్టుపై ఎందుకు దృష్టి పెట్టారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు.

"వైకాపా అధికారంలోకి రాగానే ట్రస్టు భూములపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. ఎప్పుడు మాట్లాడినా నన్ను జైలుకు పంపిస్తానని అంటున్నారు. బహుశా బెయిల్‌పై వచ్చిన పెద్దలకు జైలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. అలా అనే నేను భావించాల్సి వస్తోంది" అని అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యనించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టు బోర్డులకు మేం వ్యతిరేకం కాదు. మహిళలను ట్రస్టు బోర్డు సభ్యులుగా తీసుకుంటే కాదన్నారా?. ఆనవాయితీ కొనసాగించాలని మాత్రమే కోరుతున్నాం. కళా వెంకట్రావును రాజాంలో అరెస్టు చేసి చీపురుపల్లి తరలించారు. కళాను ఎందుకు అరెస్టు చేశారో, ఎందుకు వదిలారో తెలియదు. సింహాచలానికి చెందిన 800 ఎకరాలు మాయమైనట్లు ఆరోపిస్తున్నారు. భూముల మాయంపై సర్వే చేస్తే నిజాలు బయటకు వస్తాయి కదా. వైకాపా పెద్దలు భూములపై పడ్డారు, ఆ రకంగా సర్వేలు చేస్తున్నారు. మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు వైఖరి మారలేదు. మాన్సాస్‌ ట్రస్ట్‌ విద్యార్థులకు బోధనా ఫీజులు ఎందుకివ్వరు ?- అశోక్‌ గజపతిరాజు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్

ట్రస్టు పేరు చెప్పి కొంత మంది తెదేపా నేతలను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో ? ఎందుకు విడిచిపెట్టారో ? ఇప్పటికీ ప్రశ్నగానే ఉందని అశోక్ గజపతి రాజు అన్నారు.

సర్వే చేస్తే నిజాలు బయటకు వస్తాయి కాదా !

సింహాచలానికి చెందిన 800 ఎకరాలు మాయమైనట్లు ఆరోపిస్తున్నారని..భూముల మాయంపై సర్వే చేస్తే నిజాలు బయటకు వస్తాయి కదా! అని అశోక్‌ గజపతి రాజు అన్నారు. వైకాపా పెద్దలు భూములపై పడ్డారని, ఆ రకంగా సర్వేలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదికలో అడిగామన్నారు. మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు వైఖరి మారలేదని విమర్శించారు. ట్రస్ట్‌ విద్యార్థులకు బోధనా ఫీజులు ఎందుకివ్వరని అశోక్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: నూతన రైలు మార్గాలకు భూసేకరణపై కేంద్రం సమీక్ష.. గడువు కోరిన సీఎస్

Last Updated : Sep 3, 2021, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.