ETV Bharat / state

నాటుసారా కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు

విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో ఎస్​ఈబీ అధికారులు నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి వాహనంలో తరలిస్తుండగా కొత్తవలస వద్ద పట్టుకున్నారు.

SEB officers seized local liquor
నాటుసారా స్వాధీనం చేసుకున్న ఎస్​ఈబీ అధికారులు
author img

By

Published : Mar 19, 2021, 7:50 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో కొత్తవలస వద్ద రూ.50వేలు విలువ చేసే 460లీటర్ల నాటుసారాను ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి పాలకొండ వైపు స్కార్పియో వాహనంలో సారా రవాణా అవుతున్నట్లు సమాచారం అందిందని ఎక్సైజ్​ సూపరిండెంట్​ చెప్పారు. వెంకంపేట గోలీలు నుంచి ఆ వాహనాన్ని వెంబడించి.. కొత్తవలస వద్ద పట్టుకున్నామని తెలిపారు. వాహనాన్ని సీజ్​ చేసినట్లు చెప్పారు. డ్రైవర్​ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రవాణాదారుల వద్ద నుంచి నాటుసారా కొనుగోలు చేసిన మరో ముగ్గురిని గుర్తించినట్లు చెప్పారు. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. నాటుసారా విక్రయాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని సీఐ తెలిపారు.

విశాఖ జిల్లా

మాడుగుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు, ఎస్​ఈబీ అధికారులు దాడులు జరిపారు. చింతలూరు గడబూరులో నాటుసారా తయారీకి ఉపయోగించే 2,200 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి.. ధ్వంసం చేసినట్లు ఎస్​ఈబీ సీఐ జగదీశ్వరరావు చెప్పారు.

చీడికాడ, చుక్కపల్లిలో నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై సంతోశ్​ చెప్పారు. వారి వద్ద ఆరు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. చెట్టుపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

దేవరాపల్లి మండలంలోని ఎం.అలమండ, పెదనందిపల్లి ప్రాంతాల్లో 750 లీటర్లు, కె.కోటపాడు మండలం కొత్తభూమిలో 900 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత ఎస్సైలు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'చిన్నారుల హత్యకు భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.