విజయనగరం జిల్లా భోగాపురం మండలం తీర ప్రాంత గ్రామాలైన చేపల కంచేరు, ముక్కం సముద్ర ప్రాంతంలో వస్తున్న మార్పులకు మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. శనివారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా సముద్రపు అలలు 50 మీటర్ల వరకు వెనక్కి వెళ్లాయి.
సముద్రంలో ఇలాంటి పరిస్థితులు మూడేళ్ల క్రితం తలెత్తాయని... మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ విధంగా జరిగే అవకాశాలున్నాయని మత్స్యశాఖ ఎఫ్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: