జిల్లాలో ప్రముఖంగా జరిగే సిరిమానోత్సవ కార్యక్రమంలో... విజయనగరం పైడితల్లి తర్వాత శంబర పోలమాంబ సిరిమానోత్సం రెండో స్థానంలో ఉంటుంది. సంక్రాంతి అనంతరం నిర్వహించే ఈ కార్యక్రమం ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేకాలంకారణ, పూజల అనంతరం సిరిమానోత్సవాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం అమ్మవారి ఘట్టాలను చెదురు గుడినుంచి మేళతాలలతో ఆనందోత్సాహాల నడుమ వీధిలోకి తీసుకువచ్చారు.
అనంతరం ఆలయ ప్రధాన పూజారి భాస్కరరావును ఆలయం నుంచి సిరిమాను వరకు మోసుకొచ్చారు. ఆనవాయితీ ప్రకారం సాడేపు వంశస్థులు పూజారిని తమ భుజాలపై మోసుకుంటూ తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాల మధ్య ఘటాలు సిరిమాను వద్దకు చేరుకోగా... పూజారి సిరిమానును అధిరోహించాడు. అనంతరం సిరిమాను ఊరేగింపునకు బయలుదేరింది.
రథంపై సిరిమాను దర్శనం...
శక్తి స్వరూపిణి అయిన పోలమాంబ పూజారి రూపంలో గ్రామ వీధుల్లో సిరిమాను రథంపై దర్శనమివ్వటంతో... భక్తులు భక్తిపారవశ్యం పొందారు. సిరిమాను అధిరోహించిన పూజారికి అరటిపళ్లు, కొబ్బరికాయలు, చీరలు తాకించి మొక్కులు తీర్చుకున్నారు. సిరిమాను సంబరాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావటంతో శంబర జనసంద్రంతో సందడిగా మారింది.
వారంపాటు ప్రత్యేక పూజలు...
భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ ధర్మాదాయశాఖ మరో వారంరోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లన్నీ కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: పోలమాంబ జాతర.. పోటెత్తిన భక్తులు