కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో.. దేశంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ రైతుసంఘం విజయనగరం అధ్యక్షులు రాంబాబు మండిపడ్డారు. నగరంలోని ఎల్బీజీ భవన్లో.. రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన జరుగనున్న సార్వత్రిక సమ్మెలో.. రైతులు, కూలీల సంఘాలు, వివిధ సంస్థలు, మేధావులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న సార్వత్రిక సమ్మె, 27న కేంద్ర కార్యాలయాల వద్ద నిరసన చేపడతామని తెలిపారు.
ఇదీ చదవండి: