ETV Bharat / state

మహారాజా కళాశాలను సందర్శించిన ప్రభుత్వ పరిశీలనా కమిటీ

విజయనగరం మహారాజా కళాశాలను ప్రభుత్వ పరిశీలనా కమిటీ సందర్శించింది. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ మూవబుల్, నాన్ మూవబుల్ ఆస్తుల వివరాలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ టీచర్ల వివరాలు, ఫీజులు, నిధులు, ఇతర వివరాలపై ఆరా తీసింది. మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ పలు విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు కమిటీకి వినతులు సమర్పించారు.

author img

By

Published : Nov 20, 2020, 7:35 PM IST

మహారాజు కళాశాలను సందర్శించిన ప్రభుత్వ పరిశీలనా కమిటీ

విజయనగరం పట్టణంలో మహారాజా కళాశాలను రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పరిశీలనా కమిటీ సందర్శించింది. కళాశాలను ప్రైవేటీకరణ చేయాలంటూ ప్రస్తుత మాన్సాస్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ప్రభుత్వానికి లేఖ రాసారని.. ప్రభుత్వం ఆ మేరకు పరిశీలనా కమిటీ వేసిందని ఆర్జేడీ డేవిడ్ కుమార్ స్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆర్జేడీ కమిటీకి వినతులు అందించారు. కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని.. లేనిపక్షంలో ప్రభుత్వంలో విలీనం చేసి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని కోరారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మహారాజా కళాశాలకు సంబంధించిన మూవబుల్, నాన్ మూవబుల్ ఆస్తుల వివరాలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ టీచర్ల వివరాలు, ఫీజులు, నిధులు, ఇతర వివరాలను స్టడీ చేయటానికి కళాశాలకు వచ్చామని ఆర్జేడీ పేర్కొన్నారు. ఇది ఇన్స్​పెక్షన్ కాదని తెలిపారు. కేవలం ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు మాత్రమే వచ్చామని తెలిపారు.

ఇదీచదవండి

18 నెలల పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా: రామ్మోహన్ నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.