విజయనగరం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రీపోలింగ్ ప్రారంభంమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మూడు జిల్లాల్లోని 3 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరవగవరంలో రీపోలింగ్ జరుగుతుంది. ఇక్కడ బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా అంటిపేటలో రీపోలింగ్ జరుగుతోంది. అభ్యర్థి పేరు స్థానంలో విత్‌డ్రా చేసుకున్న వారి పేరుతో రీపోలింగ్ అనివార్యమైంది. నెల్లూరు జిల్లా ఎ.ఎస్.పేట మం. పొనుగుపాడులోనూ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎ.ఎస్.పేటలో బ్యాలెట్ బాక్సు బయటకు వెళ్లడంతో రీపోలింగ్ జరుగుతోంది.
ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్