ETV Bharat / state

మూడు జిల్లాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్ లలో నేడు రీపోలింగ్ - Re-polling in ap

పరిషత్ ఎన్నికల్లో కొన్నిచోట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ రీపోలింగ్ కు ఆదేశించింది. విజయనగరం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్ లలో నేడు రీపోలింగ్ నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

మూడు జిల్లాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్ లలో నేడు రీపోలింగ్

author img

By

Published : Apr 9, 2021, 8:00 AM IST

మూడు జిల్లాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్ లలో నేడు రీపోలింగ్

పరిషత్ ఎన్నికల్లో కొన్నిచోట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ రీపోలింగ్ కు ఆదేశించింది. విజయనగరం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్ లలో నేడు రీపోలింగ్ నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 515 జెడ్పీటీసీ, 7 వేల220 ఎంపీటీసి స్థానాల్లో ఎన్నికలు జరిగాయని తెలియచేసింది. బ్యాలెట్ పేపర్ లో తప్పిదాలు, ఘర్షణలు ఇతర కారణాల వల్ల కొన్ని చోట్ల రీపోలింగ్ కు ఆదేశాలు ఇచ్చింది.

విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంతిపేట ఎంపీటీసీ స్థానంలో 20, 21, 22 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్ ముద్రణలో తప్పిదాల కారణంగా రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లా చౌట భీమవరం లో ఎంపీటీసీ స్థానంలో 13/6 పోలింగ్ స్టేషన్ తలెత్తిన ఘర్షణలు వల్ల పోలింగ్ కు ఆటంకం ఏర్పడినట్లు ఎస్ఈసీ కార్యాలయం తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 26 పోలింగ్ కేంద్రంలో ఉండాల్సిన బ్యాలెట్ పత్రాలు...... మరో పోలింగ్ కేంద్రంలో దొరకడంతో పోలింగ్ రద్దు చేశారు.

ఇదీ చదవండి: పరిషత్ ఎన్నికలు: రాష్ట్ర వ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్ నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.